Chandrababu Bail petition: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా వేసిన సుప్రీం కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
స్కిల్ కుంభకోణం కేసు (Skill scam) లో చంద్రబాబు నాయుడు(Chandra babu) బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో (supreme court) వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
ఈ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు మే 7 వ తేదీ వరకు వాయిదా వేసింది.చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ కు రాగా జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించింది.
చంద్ర బాబు కు వ్యతిరేకంగా చార్జిషీట్ దాఖలైనట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ ధర్మాసనానికి వివరించారు.
Details
లోకేష్ ప్రసంగాలను కోర్టుకు..
తాము అధికారంలోకి వచ్చాక దర్యాప్తు అధికారుల సంగతి చూస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై ఐఏ దాఖలు చేసినట్లు చెప్పారు.
రెడ్ బుక్ లో రాసుకున్న దర్యాప్తు అధికారుల పేర్లను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని సస్పెండ్ చేయడమో లేక బదిలీ చేయడమో చేస్తామని లోకేష్ చేస్తున్న ప్రసంగాలను కూడా కోర్టుకు అందజేసినట్లు ధర్మాసనానికి తెలిపారు.
చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు.