
Kesineni Chinni: విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై ఏసీఏ అధ్యక్షుడు వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖస్టేడియం పేరు మార్పు అంశంపై వైసీపీకి టీడీపీ తిరిగి కౌంటర్ ఇచ్చింది.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ACA)అధ్యక్షుడు కేశినేని చిన్ని వైసీపీకి గట్టి సమాధానం ఇచ్చారు.
క్రీడలను రాజకీయాలకు ముడిపెట్టకూడదని స్పష్టం చేశారు.స్టేడియానికి గత 30 ఏళ్లుగా ఉన్న పేరు మార్పు చేయలేదని,ఈవివాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ క్రియేట్ చేస్తోందని ఆయన విమర్శించారు.
వైసీపీ నేతలు ఎందుకు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారో వారికే తెలియాలి అన్నారు.
విశాఖ క్రికెట్ ప్రతిష్ఠను పెంచేలా కూటమి ప్రభుత్వం కృషి చేసి,అంతర్జాతీయ మ్యాచ్‌లను తెచ్చింది. కానీ, వైసీపీ నేతలు విశాఖ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు.
ఈ పరిస్థితులను చూసిన విశాఖ ప్రజలు వైసీపీతో ఉండటం లేదని ఆయన అన్నారు.
వివరాలు
విశాఖతో పాటు పులివెందులలో కూడా మ్యాచ్‌లు
"మేము స్టేడియం దగ్గర రాజకీయాలు మాట్లాడడం లేదు. విశాఖలోనే కాదు, కడప జిల్లా పులివెందులలో కూడా త్వరలో మ్యాచ్‌లు నిర్వహిస్తాం" అని కేశినేని చిన్ని తెలిపారు.
ఈ నెల 24, 30 తేదీల్లో జరగబోయే మ్యాచ్‌లకు ప్రజలు మంచి స్పందన ఇవ్వబోతున్నారు అని అన్నారు.
తాను ACA అధ్యక్షుడిగా ఉండటానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ కారణమని తెలిపారు.
విశాఖ స్టేడియంలో మౌలిక వసతులు లేకపోవడంతో,సదరు వసతులను ఆధునీకరించాలని సూచించారని, తాము జనవరి 20 నుంచి మార్చి 1 వరకు స్టేడియం అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.
34 గదులను అప్‌గ్రేడ్ చేసి, 320 టాయిలెట్లు ఆధునీకరించామన్నారు.
డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించిన వెంకటపతిరాజు వంటి క్రీడా ప్రముఖులు తమ పనితీరును మెచ్చుకున్నారని చెప్పారు.
వివరాలు
స్టేడియం అభివృద్ధి - భవిష్యత్ ప్రణాళికలు
రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత స్టేడియం ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
ప్రేక్షకులకు వినోదాన్ని అందించేలా స్టేడియాన్ని తీర్చిదిద్దామని,కేవలం రెండు నెలల్లో స్టేడియాన్ని ఫ్లడ్ లైట్‌లతో మెరుగుపరచడం గొప్ప విజయం అని చెప్పారు.
ఈ పనిలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.అలాగే,అమరావతిని స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
విజయనగరం,మూలపాడు ప్రాంతాల్లో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రతి ఏడాది 30 గ్రౌండ్లను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని తెలిపారు.
ప్రతిభ గల పిల్లలను గుర్తించి, వారిని ప్రొఫెషనల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వివరించారు.
అమరావతి స్టేడియానికి జైస్వాల్ అనుమతి ఇచ్చారని, BCCI కూడా ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి సహాయంగా ఉంటుందని కేశినేని చిన్ని తెలిపారు.