అభిమాన గాయకుడ్ని అన్‌ఫాలో చేసిన కోహ్లీ, రైనా.. నెట్టింట తీవ్ర విమర్శలపాలైన పంజాబీ గాయకుడు శుభ్
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల సెగ ఇతర రంగాల ప్రముఖులను తాకింది. ఈ మేరకు ఓ పంజాబీ సింగర్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల కారణంగా నెట్టింట తీవ్ర విమర్శలపాలయ్యాడు. తన అభిమాన గాయకుడు శుభ్‌ను, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడమే ఇందుకు కారణం. కెనడాకు చెందిన పంజాబీ గాయకుడు శుభ్ తన ఇన్ స్టాగ్రామ్ లో వివాదాస్పద భారత్ మ్యాప్ ను పోస్ట్ చేశాడు. దీంతో అసంతృప్తికి గురైన విరాట్, వెంటనే అతన్ని అన్ ఫాలో చేసేశాడు. ఐపీఎల్ 2023 సమయంలో కోహ్లీ, అనుష్క దంపతులు అతని పాటకు డ్యాన్స్ చేశారు. కోహ్లీ బాటలోనే సురేశ్ రైనా సైతం గాయకుడ్ని అన్‌ఫాలో చేయడం గమనార్హం.