Telangana Assembly: అసెంబ్లీలో తొలిసారి డబుల్ డిజిట్‌కు చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య
తెలంగాణ అసెంబ్లీలో ఈసారి మహిళ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడగా.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత ఎక్కువ మంది మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 10మది మహిళా ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ నుంచి అత్యధికంగా ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు ఉన్నారు. 1.పాలకుర్తి నుంచి యశస్వినీరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుపై 46,367 ఓట్ల మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 2.కోదాడ నుంచి పద్మావతిరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యపై 58,172 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ములుగు నుంచి సీతక్క, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ
3. ములుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. 4. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ప్రత్యర్థి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై 15,652 ఓట్ల మెజారిటీని సాధించారు 5. నారాయణపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణికారెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిపై 7,951 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 6. సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి.. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యపై 19,440 ఓట్ల మెజారిటీని సాధిచారు.
బీఅర్ఎస్ నుంచి గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు వీరే
7. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్ పై 17, 169 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 8. మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి.. బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములుపై 26,187 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 9. ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మీ.. కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరాశ్యామ్ పై 22,798 ఓట్ల మెజారిటీతో గెలిచారు 10. నర్సాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరాడ్డిపై 8,855 ఓట్ల తేడాతో విజయం సాధించారు.