Page Loader
Telangana assembly session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం 
Telangana assembly session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

Telangana assembly session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం 

వ్రాసిన వారు Stalin
Dec 09, 2023
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. 3వ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్‌కు శుక్రవారం సర్జరీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్‌తో కేటీఆర్ తొలిరోజు సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో తాము ప్రమాణ స్వీకారం చేసేందుకు మరోసారి సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కోరారు. ఇదిలా ఉంటే, ప్రొటెం స్పీకర్‌‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీని నియమించడంపై బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. దీంతో ప్రమాణస్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నికయ్యాక తాము ప్రమాణ స్వీకారం చేస్తామని ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాణస్వీకారం చేస్తున్న ఎమ్మెల్యేలు