తెలంగాణ బీజేపీలో బీసీ సీఎం.. రేసులో ఈటెల, బండి సంజయ్
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని రంగంలోకి దించనుంది. ఈ మేరకు వెనుకబడిన తరగతికి చెందిన కీలక నాయకులైన ఈటెల రాజేందర్, బండి సంజయ్ కుమార్ లను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ క్రమంలోనే బీజేపీ తెలంగాణ తొలి జాబితాను ఖరారు చేసేందుకు రెడీగా ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చిస్తున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, ఎంపి కె.లక్ష్మణ్‌తో కలిసి బుధవారం సాయంత్రం దాదాపు 40 మంది అభ్యర్థుల జాబితాతో కేంద్ర స్క్రీనింగ్ కమిటీ ఆమోదం కోసం దిల్లీ పెద్దలను కలిశారు.
తెలంగాణ బీజేపీకి చెందిన ఓబీసీ ప్రముఖు నేతలు వీరే..
కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఓబీసీ నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచిస్తోంది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్న బీజేపీ, ఓబీసీ నాయకుడిని తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ - ఎన్నికల కమిటీ ఛైర్మన్ బండి సంజయ్ కుమార్ - బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ - బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా బీసీ వర్గాలకు చెందిన వారు ఇప్పటి వరకూ ఎవరూ లేనందున, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓబీసీ నేతను ప్రకటించడం వల్ల పార్టీకి భారీ మైలేజీ వస్తుందని పార్టీ అభిప్రాయపడుతోంది.