Telangana Budget: రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఇందులో రూ.2,26,982 కోట్లు రెవెన్యూ వ్యయం, రూ.36,504 కోట్లు మూలధన వ్యయం కేటాయించామని తెలిపారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారన్నారు.
పాలనలో పూర్తి జవాబుదారీతనం పాటిస్తూ, గత ప్రభుత్వ పాలనలో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని చెప్పారు.
తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నామని, అయితే కొందరు నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Details
శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు
పంచాయతీరాజ్ శాఖ - రూ.31,605 కోట్లు
వ్యవసాయశాఖ - రూ.24,439 కోట్లు
విద్యాశాఖ - రూ.23,108 కోట్లు
మహిళా, శిశుసంక్షేమశాఖ - రూ.2,862 కోట్లు
పశు సంవర్థకశాఖ - రూ.1,674 కోట్లు
పౌరసరఫరాల శాఖ - రూ.5,734 కోట్లు
కార్మికశాఖ - రూ.900 కోట్లు
ఎస్సీ సంక్షేమం - రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం - రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం - రూ.11,405 కోట్లు
చేనేత రంగం - రూ.371 కోట్లు
మైనారిటీ సంక్షేమశాఖ - రూ.3,591 కోట్లు
పరిశ్రమలశాఖ - రూ.3,527 కోట్లు
ఐటీ రంగం - రూ.774 కోట్లు
ఈ బడ్జెట్ ద్వారా తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమానికి నూతన దిశానిర్దేశం కలుగుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.