Telangana Cabinet Meeting: ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభ ఆవరణంలోని కమిటీ హాల్ లో ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం సర్క్యులర్ జారీ చేశారు.
శాఖల వారీగా మంత్రివర్గం ఆమోదానికి నివేదించాల్సిన అంశాలను సిద్ధం చేయాలనిసూచించినట్లు తెలుస్తోంది.
Details
ఆగస్టు 3న సీఎం అమెరికా పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుంచి 13 వరకు అమెరికా పర్యటనకు వెళ్తుతుండటంతో మంత్రి వర్గ సమావశేశాన్ని ఒకటో తేదీనా నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది.
ఈ అమెరికా పర్యటనకు సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, సీఎస్ శాంతికుమార్ వెళ్లనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తిగా ఉండటంతో వారితో చర్చలు జరపేందుకు సీఎం వెళ్లనున్నట్లు తెలిసింది.