Page Loader
125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ 
125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ 

వ్రాసిన వారు Stalin
Apr 14, 2023
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ చారిత్రక ఘట్టానికి భాగ్యనగరం వేదకైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్‌ హాజరయ్యారు. ఈ వేడుకను తిలకించేందుకు తెలంగాణ జిల్ల్లాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, అంబేద్కర్ వాదులు తరలించారు. దీంతో హైదరాబాద్‌లోని సాగరతీరం, ఎన్టీఆర్‌మార్గ్‌అంతా జనసందోహంతో నిండిపోయింది. విగ్రహావిష్కరణను వీక్షించేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని భాగ్యనగరం నడిబొడ్డున ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్