
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఢిల్లీలో ఏఐసీసీ నాయకులతో సమావేశం కానున్నారు.
రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కీలక ఏఐసీసీ నాయకులతో చర్చించనున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటన మరొకసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ పర్యటన కాంగ్రెస్ నాయకుల్లో ఆసక్తికరంగా మారింది.
వివరాలు
మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం
ఈ సందర్భంగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలనే ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది.
అలాగే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
కేబినెట్‌లో చేరాలనుకునే కాంగ్రెస్ నాయకుల జాబితా ఇప్పటికే ఢిల్లీ నాయకులకు చేరింది.
సీఎం ఢిల్లీ పర్యటనతో ఎమ్మెల్సీ ఎన్నికల అంశం, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.