Page Loader
MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్‌ను ప్రకటించిన కాంగ్రెస్ 
MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్‌ను ప్రకటించిన కాంగ్రెస్

MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్‌ను ప్రకటించిన కాంగ్రెస్ 

వ్రాసిన వారు Stalin
Jan 16, 2024
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

Telangana Congress MLC Candidates: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ ఫైనల్ చేసింది. శాసనమండలిలో రెండు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌‌ను అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఇద్దరి నేతలకు అధిష్టానం సమాచారం ఇచ్చింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లకు ఎల్లుండి చివరి తేదీ కావడంతో.. అధిష్టానం ఈ రోజు ఫైనల్ చేసింది. అదే విధంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌తో పాటు జావెద్ అలీ ఖాన్ కుమారుడు అమీర్ అలీ ఖాన్ పేర్లను కూడా అధిష్ఠానం ఫైనల్ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అభ్యర్థులకు సమాచారం ఇచ్చిన అధిష్టానం