Telangana Elections 2023: తెలంగాణ పోలింగ్ వేళ చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..
రాష్ట్రంలో ప్రచార హోరు ముగిసింది. ఈ మేరకు సైలెంట్ పీరియడ్ మొదలైందని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కమిషనర్ వికాస్‌రాజ్ మీడియా మీట్'లో మాట్లాడారు. ఇకపై ఎటువంటి ప్రచారానికి తావులేదని కమిషనర్ స్పష్టం చేశారు. పార్టీలోనూ ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని, స్థానికేతరులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. ప్రచారం నిషిద్ధం : సినిమాలు, సోషల్ మీడియా, టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్‌వర్క్ అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం ఉంది. ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రదర్శనలు వద్దు. పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్'పై నిషేధం ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు :
119 అసెంబ్లీ స్థానాలకు 2,290 అభ్యర్థులు రేసులో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ తెలంగాణ మొత్తం ఓటర్లు : 3 కోట్ల 26 లక్షలు మహిళా ఓటర్లు : కోటి 63 లక్షల 1,705 మంది పురుష ఓటర్లు : కోటి 62 లక్షల 92వేల 418 మంది ట్రాన్స్‌జెండర్లు : 2,676 మంది పోలింగ్ కేంద్రాలు : మొత్తం 35,655 సమస్యాత్మకమైనవి : 12వేల పోలింగ్ కేంద్రాలు తొలిసారి ఓటర్లు : 9 లక్షల 99వేల 667 మంది ఎలక్షన్ డ్యూటీ : లక్షా 40 వేల మంది సిబ్బంది హోం ఓటింగ్ : 27,175 మంది ఓటు హక్కు వినియోగం వెబ్ క్యాస్టింగ్ కేంద్రాలు : 27,094 నవంబర్-30న పోలింగ్ డిసెంబర్-03న కౌంటింగ్
రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది పర్యవేక్షకులు ఉన్నారో తెలుసా
80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ఓటింగ్ శాతం పెంపుదల కోసం 644 మోడల్ PSలు దివ్యాంగులు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాలు 120 మహిళలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాలు 597 పోలింగ్ క్రతువులో పాల్గొననున్న 1,85,000 మంది సిబ్బంది పరిశీలించనున్న 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు ఓటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు దివ్యాంగుల కోసం 21,686 వీల్ ఛైర్లు రెఢీ ఓటరు స్లిప్పుల్లో పార్టీల గుర్తులు, అభ్యర్థుల పేర్లు నిషేధం పోలింగ్ స్టేషన్లకు మొబైల్ అనుమతి లేదు ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ MCC కోడ్ జారీ చేశారు.
అంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది : హైదరాబాద్ సీపీ
ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఖర్చు రూ.150 కోట్లు ఖర్చు తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాలు : 13 సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రం తరఫున : 375 కంపెనీల సాయుధ బలగాలు రాష్ట్రం తరఫున : అన్ని రకాల పోలీసులు కలిపి 50 వేల మంది. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండలో ఇలా : హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు సీపీ సందీప్ శాండిల్య వెల్లడించారు.నేటి నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం,కల్లు దుకాణాలు మూసివేస్తున్నామన్నారు. అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. దీంతో ఐదుగురికి మించి గుమిగూడొద్దని హెచ్చరిస్తూ ముగ్గురు సీపీలు ఆదేశాలిచ్చారు.