LOADING...
Telangana: మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత  
Telangana: మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత

Telangana: మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2024
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

పెద్దపల్లి మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు మృతి చెందారు. వృద్దాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే,పరిస్థితి విషమించడంతో ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన రాజకీయ జీవితం టిడిపితో మొదలైంది. మొట్టమొదట సుల్తానాబాద్ పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నిక అయ్యిన తరువాత 1989లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

Details 

 1994లో తొలి సారిగా అసెంబ్లీలో..

అయితే తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయాడు. అనంతరం 1994లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డిపై 39677 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి తొలి సారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2018లో టిడిపిని వీడి బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. 2023 లో కాంగ్రెస్ పార్టీ లో చేరి ఎమ్మెల్యే విజయ రమణారావు గెలుపులో కీలక పాత్ర పోషించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత