Page Loader
తెలంగాణలో నేటి నుంచి 2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం 
భారీవర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణలో నేటి నుంచి 2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 20, 2023
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు సెలవులు ప్రకటించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్‌ చేశారు. భారీ నుంచి అతిభారీ వర్షాల వల్ల జనజీవనం ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ఈ మేరకు ముందస్తు చర్యల్లో భాగంగానే సెలవులు ప్రకటిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్టులను వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రెడ్ జోన్ ప్రాంతంలో ప్రజలెవరూ బయటకురాకూడదని సూచనలు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 మంత్రి సబితా చేసిన ట్వీట్