Page Loader
Runamafi: రుణమాఫీ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు.. ఇలా చేస్తే వడ్డీ వ్యాపారులకు చెక్
రుణమాఫీ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు.. ఇలా చేస్తే వడ్డీ వ్యాపారులకు చెక్

Runamafi: రుణమాఫీ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు.. ఇలా చేస్తే వడ్డీ వ్యాపారులకు చెక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2024
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రుణమాఫీ కీలకంగా మారింది. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే మూడు విడతల్లో రుణమాఫీ చేశారు. కానీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ ఎవరికి అందలేదని గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, 31 సాంకేతిక సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

Details

రుణమాఫీ అందని రైతుల జాబితాను సిద్ధం చేయాలి

రైతుల బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌కు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ కాకపోవడం, ఆధార్‌కార్డులో పేరు, లోన్‌ అకౌంట్‌ పేరు వేరువేరుగా ఉండటం వంటి సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా రుణాలు తీసుకున్న రైతు కుటుంబంలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కావడం, ఒక రైతుకు ఒకటి కంటే ఎక్కువ లోన్‌ అకౌంట్లు ఉన్నా రుణమాఫీ వర్తించలేదన్నారు. ఇక అర్హత ఉండి రుణమాఫీ అందని రైతుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించింది. అర్హులందరికీ రుణమాఫీ అందాలని దానిపై సమాలోచనలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు.

Details

పంట రుణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

రైతుల సంక్షేమం కోసం పంట రుణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ వడ్డీ రేటుకే పంట రుణాలు అందేలా ప్రణాళికలను రచిస్తోంది. బ్యాంకుల్లో పంట రుణాలు పొందలేని రైతులు, ప్రయివేటు వ్యాపారుల వద్ద భారీ వడ్డీకి రుణాలు ఇస్తుంటారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ప్రయివేటు వ్యాపారులు రైతులకు ఇచ్చే పంట రుణాలపై ఎంత వడ్డీ వసూలు చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించనుంది. ప్రయివేటు వ్యాపారులు 2శాతం కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయకూడదని నిబంధన విధించింది.