Page Loader
తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం
తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం

తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం

వ్రాసిన వారు Stalin
Jun 20, 2023
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కీలక పనులను చేపట్టింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న విద్యార్థులకు రాగిజావను అల్పాహారంగా అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి విద్యార్థికి 250 మిల్లీ లీటర్ల రాగిజావను అందిస్తున్నారు. దీని ద్వారా 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,26,907 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు 20,000 ట్యాబ్‌లను పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించింది.

రాగిజావ

నోట్ పుస్తకాల పంపిణీ

'తెలంగాణ విద్యా దినోత్సవం'లో భాగంగా మరికొన్ని కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపట్టినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమం కింద పునరుద్ధరించిన పాఠశాలలను మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణి చేశారు. ఈ ఏడాది ప్రభుత్వం రూ.190 కోట్ల వ్యయంతో 30లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తోంది. ప్రభుత్వం రూ.150 కోట్ల వ్యయంతో 26 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌లను అందజేస్తోంది.