Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంటింటికీ ఫ్రీగా హైస్పీడ్ ఇంటర్నెట్
తెలంగాణ వాసులకు శుభవార్త. త్వరలో ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోనూ ఈ సేవలను అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకొంటుంది. రాష్ట్రం మొత్తం 33 జిల్లాలను 10 జోన్లుగా విభజించి, టీ ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ద్వారా ప్రైవేట్ సంస్థల ద్వారా ఇంటర్నెట్ అందించే ప్రణాళికతో ఫ్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి టెండర్లు ఇటీవల ఆహ్వానించారు. మొదటిది 3 నెలల పాటు ఇంటర్నెట్, టీవీ ప్రసారాలను ఉచితంగా అందించనున్నారు. ఆ తరువాత, ఈ సేవలను అత్యంత తక్కువ ధరలలో అందించేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. అందుకు అధికారులు కార్యచరణ మెుదలుపెట్టారు.
నెలకు రూ.300
ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలను నెలకు రూ.300కే అందించనున్నట్లు సమాచారం. ఇటీవల, సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో భేటీ అయ్యారు. తమ ప్రభుత్వానికి చెందిన టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3లో చేర్చాలని సీఎం కోరారు. తెలంగాణలో ప్రతి గ్రామం, మండలానికి నెట్‌వర్క్ అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యమని సీఎం సింధియాకు వివరించారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. 63 లక్షల గ్రామీణ ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం అందించనున్నట్లు తెలిపారు.
మూడు నెలల పాటు ఉచితంగా సేవలు
తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు ఎన్ఎఫ్ఓఎన్ (NFON) సహకారం అవసరమని, రూ.1,779 కోట్ల వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నెలకు కేవలం రూ.300కే హైస్పీడ్ ఇంటర్నెట్, టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించబడతాయి. కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేయడంతో, త్వరలోనే టెండర్లు ఆహ్వానించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. పథకం ప్రారంభం తర్వాత మూడు నెలల పాటు ఉచితంగా సేవలను పొందవచ్చు.