తదుపరి వార్తా కథనం
Job Calendar 2024 : గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 02, 2024
06:39 pm
ఈ వార్తాకథనం ఏంటి
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.
అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్‌ను ఇవాళ విడుదల చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఈ జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని, నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో పోస్టుల సంఖ్యను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Details
ఇకపై యూపీఎస్ తరహాలో జాబ్ క్యాలెండర్
ఇకపై ప్రతేడాది యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనుంది.
మేని ఫెస్టోలో ప్రకటించిన జాబ్ కేలండర్ కు చట్టబద్ధత కల్పించడానికి శాసనసభలో ప్రకటిస్తామన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గీరణకపై త్వరలో ఆర్డినెన్స్ జారీ చేసి గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లకు వర్తింపజేస్తామన్నారు.