Telangana Hung : తెలంగాణలో హంగ్ వస్తే ఏం జరుగనుందో తెలుసా.. ఎవరెవరూ చేతులు కలుపుతారంటే..
తెలంగాణలో రాజకీయాలు వేడి రాజుకున్నాయి.ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచార శంఖారాన్ని పూరించాయి. ఈసారి హంగ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ దూసుకెళ్తోంది.ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఇంకోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సైతం అదే జోరును కొనసాగిస్తోంది.ఆ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గులాబీ అధిష్టానంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. గత ఎన్నికల హామీలే ఇంకా నెరవేర్చలేదంటూ,ప్రభుత్వ వైఫల్యాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక బీజేపీ సైతం ప్రచారం పర్వాన్ని మెల్లగా ఆరంభించినా, ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీలకు ధీటుగానే కొనసాగిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు ఈటెల, కే.లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అర్వింద్ హోరెత్తిస్తున్నారు.
ప్లాన్ ఏ, బీ, సీలను రెడి చేసుకుంటున్న పార్టీలు
బీజేపీ జాతీయ నేతలు ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, యోగి లాంటి ఉద్దండులతో కషాయ ప్రచారం మరించ ఊపందుకోనుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. కానీ మరోవైపు బీజేపీకి 30 స్థానాలకు పైగా వచ్చి ప్రభుత్వం ఏర్పాటుకు భావిస్తే బీఆర్ఎస్, మిత్రపక్షం మజ్లిస్ కాషాయ కూటమికి మద్ధతు పలకాల్సి వస్తుంది.అందరి దృష్టి డిసెంబర్ 3న వచ్చే ఫలితాలు మీదే ఉంది. ప్లాన్ ఏ- రాజకీయ పార్టీలు డైరెక్టుగా ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థిస్తాయి. ప్లాన్ బీ- ఫలితాల తర్వాత జరిగే వ్యూహ, ప్రతివ్యూహాలు, జంపింగ్స్ ఇందులో ఉంటాయి. ప్లాన్ సీ -పై రెండూ కుదరపోతే ఇదీ అమలు చేయొచ్చు.
బీఆర్ఎస్ 53 గెలిస్తే చాలు, మిగతా బలం మజ్లిస్ పార్టీదే
తెలంగాణలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే ఓ రెండు పార్టీలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. హంగ్ వస్తే ఎలా : 119 అసెంబ్లీ స్థానాల్లో 112 స్థానాలే అన్ని పార్టీలకు లెక్క. మిగతా 7 స్థానాల్లో మజ్లిస్ పాగా వేస్తుంది. ఈ మేరకు 112లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం 53 వచ్చినా మేజిక్ ఫిగర్ కు 7 స్థానాల దూరంలో ఉంటుంది. ఈ సందర్భంగా మజ్లిస్ ఆ లోటును పూడ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుంది. ఒకవేళ గులాబీకి 45 స్థానాల వరకే వస్తే బీజేపీ,లేదా కాంగ్రెస్ పార్టీతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కలసే అవకాశం ఉండదు. బీఆర్ఎస్ ఒక జాతీయ పార్టీతో మాత్రమే కలవాల్సి ఉంటుంది.
30 స్థానాల్లో గెలిచినా చాలని భావిస్తున్న బీజేపీ
మరోవైపు బీజేపీకి 30 స్థానాలకు పైగా వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తే బీఆర్ఎస్ తో పాటు దీని మిత్రపక్షం మజ్లిస్ కాషాయ కూటమికి మద్ధతు పలకాల్సి వస్తుంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజారిటీ 60 సీట్లు వస్తే అంతా సాఫీగా ఉంటుంది. లేదంటే ఈ పార్టీకి కష్టకాలమే. గెలిచిన అభ్యర్థులను కూడా కాపాడుకోవడం కష్టమవుతుంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సామ బేధ దండోపాయలను ఉపయోగించే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ ఇదే దారిలోనే వెళ్లారు. రాజకీయ పునరేకీకరణ పేరిట టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకున్నారు.ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ ప్రభుత్వానికే మజ్లిస్ సపోర్ట్ చేయడం గమనార్హం.
హంగ్ ఏర్పడితే ఏఏ పార్టీలు ఎలా కలవనున్నాయంటే :
1. బీఆర్ఎస్ గులాబీ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే మజ్లిస్ నుంచి సపోర్ట్ తీసుకోవడం ఒకటి. రెండోది కాంగ్రెస్, బీజేపీల నుంచి గెలిచిన వారిని బీఆర్ఎస్ లోకి తీసుకునే అవకాశం ఉంది. 2. బీజేపీ ఒకవేళ బీజేపీ 30పైచిలుకు స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు మజ్లిస్ సపోర్ట్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఇటీవలే దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 3. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే ఆ పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయి. అసలే 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థులకే గాలం వేస్తుంటాయి. అందుకే 60కిపైగా స్థానాలు తెచ్చుకునేందుకే కాంగ్రెస్ పోరాడుతోంది.