
kaleshwaram project: కాళేశ్వరం లోపాలు బట్టబయలు: ప్రజాధనం దుర్వినియోగంపై ఘోష్ కమిషన్ నివేదిక: ఉత్తమ్
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని పేర్కొన్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం (ఆగస్టు 4న) తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో అనేక లోపాలు ఉన్నాయని నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీసీఏ) స్పష్టంగా చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పడం సరైంది కాదని పీసీ ఘోష్ కమిషన్ పేర్కొనడం గమనార్హమని అన్నారు. అలాగే, మేడిగడ్డ బ్యారేజ్ స్థానంపై హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని పట్టించుకోలేదని ఆరోపించారు.Embed
వివరాలు
కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా నిర్ణయాలు
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి బాధ్యత కేసీఆర్‌పైనే ఉందని ఘోష్ కమిషన్ తేల్చిందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో ప్లానింగ్, డిజైనింగ్, ఆర్థిక వ్యవహారాలు అన్నీ కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగాయని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను అంచనాలు పెంచి నిర్మించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. ప్రాజెక్టు కమిషన్‌కు అప్పటి మంత్రి హరీష్‌రావు సరైన సమాచారాన్ని అందించలేదని, మేడిగడ్డను తగిన ప్రదేశంలో నిర్మించలేదని తెలిపారు. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అని గత ప్రభుత్వంతో చెప్పింది నిజాయితీతో చెప్పింది కాదు అని ఘోష్ కమిషన్ చెప్పింది - ఉత్తమ్
— News Line Telugu (@NewsLineTelugu) August 4, 2025
తెలుగు మీడియాకు తెలుగులో
ఇంగ్లీష్ మీడియాకు ఇంగ్లీష్ లో
విజ్ఞప్తి చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి pic.twitter.com/5K9gmlMgFN