Telangana Voters List: నేటి నుంచి కొత్త ఓటు నమోదు,సవరణ ప్రారంభం.. ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్‌వోలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నక్రమంలో ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమోదు,సవరణ కార్యక్రమాన్నినేటి నుంచి చేపట్టనుంది. ఈ మేరకు 1 జనవరి 2025 నాటికి 18 ఏళ్లు నిండే వారందరూ ఓటరుగా నమోదు కావడానికి నేటి నుంచి ఎన్నిక ల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఓటర్ నమోదు, సవరణలను సరిదిద్దేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఆగష్టు 20 నుంచి బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి ఓటర్ వివరాలు సేకరించనున్నారు. ఓటర్లుగా అర్హత కలిగిన వారిని నమోదతో పాటు పాత ఓటర్ కార్డులో ఏదైనా సవరణ ఉంటె చెయ్యడం, మృతుల వివరాలను జాబితానుంచి తొలగించడమే కాకుండా.. ఫొటో లేనివారివి చేర్చిడం వీరి డ్యూటీ. ఇందుకు సంభదించి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంతకముందు ఓటరు జాబితా ఆధారం గా జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గా ల పరిధిలో 29,39,486 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఓటు నమోదుకు సుమారు 25 వేల మంది యువత అర్హులుగా ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో డిగ్రీ,అలాగే సమాన కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులతో పాటు ఇతర రంగాల్లోని యువత 1 జనవరి 2025 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఉమ్మడి జిల్లాలో 25 వేల మందికి పైగా ఉం టారని అంచనా.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా..
కరీంనగర్ జిల్లాలో ఓటర్లు 10,77,336 మంది,పెద్దపల్లి జిల్లాలో 7,17,258 మంది, జగిత్యాల జిల్లాలో 7,12,947 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 472906 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఓటరు నమోదు ఇలా చేసుకోండి
ఓటు నమోదు చేయడానికి వెబ్‌సైట్ https://ceotelangana.nic.in/ ద్వారా ఓటు నమోదు, సవరణకు అవకాశం అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను తమ బీఎల్‌వో కు అందించాల్సి ఉంటుంది. దాని కోసం కొత్తగా ఓటు నమోదుకు ఫారం -6, ఓటు కార్డుకు ఆధార్ నెంబర్ అనుసంధానానికి ఫారం -6(బీ), జాబితా నుంచి తొలగింపునకు ఫారం-7, తప్పు ఒప్పుల సవరణకు ఫారం-8 ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను పూరించి సమర్పించాక బీఎల్‌వోలు విచారించి ఆమోదించడం లేదా తిరస్కరించడం చేస్తారు. తిరస్కరించిన దరఖాస్తులపై తిరిగి అప్పిల్ చేసుకునే అవకాశం ఉంటుంది.