
తెలంగాణ: 2023-24 అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్.. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తంగా 229 పని దినాలు ఉంటాయని వెల్లడించింది. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ మొదలుకానుంది.
వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24న లాస్ట్ వర్కింగ్ డేగా నిర్ణయించింది. ఇకపై తెలంగాణలో స్కూల్ పిల్లలకు ప్రతీ నెలలో నాలుగో శనివారం నో బ్యాగ్ డేగా డిక్లేర్ చేసినట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఆరోజు బడి పిల్లలకు పుస్తకాల సంచి మోసే భారం నుంచి విముక్తి కల్పిస్తున్నామన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో రోజంతా ఆట పాటలు ఉంటాయన్నారు. ఒక పక్క వారానికి 3 నుంచి 5 పీరియడ్ల గేమ్స్ ను కంపల్సరీ చేశారు.
Details
ఈసారి పదో తరగతికి జనవరి 10 నాటికే సిలబస్ పూర్తి
మరోవైపు రోజూ 30 నిమిషాల పాటు పుస్తకాలు చదివడం, 5 నిమిషాల పాటు పిల్లలతో యోగా, ధ్యానంపై దృష్టి సారించేలా చూడాలని స్పష్టం చేశారు.
ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వారికి ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలను నిర్వహిస్తామన్నారు. 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలకు జనవరి 10 నాటికే సిలబస్‌ను పూర్తి చేయనున్నారు.
హాలిడేస్ షెడ్యూల్.. తగ్గిన పండగ రోజులు :
ఈ సంవత్సరం దసరా పండుగ సెలవులు అక్టోబర్ 14 నుంచి 25 వరకు ఉండనున్నాయి. అయితే ఫెస్టివల్ హాలిడేస్ సంఖ్యను 14 రోజుల నుంచి 13 రోజులకు కుదించడం గమనార్హం.
Details
ఈసారి తగ్గిన పండగ సెలవులు
క్రిస్మస్ సెలవులను కూడా 7 నుంచి 5కు తగ్గించారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రతి నెల మూడో శనివారం పేరెంట్, టీచర్ సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ప్రతి నెల తొలి వారంలోనే పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలన్నారు.
2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఎండాకాలం సెలవులుగా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్‌లో పొందుపర్చింది.
ఈ మేరకు జిల్లాల డీఈఓలకు, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎస్‌సీఈఆర్టీ, మోడల్ స్కూల్ , ప్రభుత్వ పరీక్షల విభాగం, ఎస్‌ఐఈటీ, గురుకుల విద్యాలయాల, హైదరాబాద్, వరంగల్ రీజినల్ జాయింట్ స్కూల్ ఎడ్యుకేషన్ సహా అన్ని డైరెక్టరేట్లను ఆదేశించింది.