తదుపరి వార్తా కథనం

Telangana-Tenth Result: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. జూన్ 3వ తేదీ నుండి టెన్త్ సప్లిమెంటరీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ (Telangana) పదో తరగతి (Tenth Result) ఫలితాలను మంగళవారం హైదరాబాద్ లోని ఎస్సీ ఈఆర్టి కాంప్లెక్స్ గోదావరి ఆడిటోరియంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఏడాది మార్చి 18 నుంచి .ఏప్రిల్ రెండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల 5,83, 85 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఫలితాలను క్రింది లింకు ద్వారా వేగంగా తెలుసుకోండి
Details
జూన్ 3వ తేదీ నుండి టెన్త్ సప్లిమెంటరీ
ఈ సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ.. జూన్ 3వ తేదీ నుండి 13 జూన్ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఫీజులు కట్టే విషయం త్వరలో క్లారిటీ ఇస్తామని ప్రకటించారు.