Telangana : తెలంగాణలో మహిళా ఓటర్లదే హవా.. పురుషులు ఎంత మందో తెలుసా
తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితాను బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల ఓటర్ల కంటే అధికంగా నమోదైంది. ఈమేరకు తెలంగాణలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉండగా, వారిలో మహిళా ఓటర్ల సంఖ్య 1,63,01,705గా రికార్డు అయ్యింది. మరోవైపు పురుష ఓటర్ల సంఖ్య 1,62,98,418గా నమోదైంది. అయితే పురుష ఓటర్ల కంటే మహిళల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. ఇదే సమయంలో ట్రాన్స్ జెండర్స్ 2,676 మంది ఉండగా,సర్వీస్ ఓటర్లు మొత్తం 15,406 మంది ఉన్నారని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పేర్కొన్నారు.
1000 మంది పురుషులకు 1000.2 మహిళా ఓటర్లు
2023 జనవరి 5 నాటికి 1000 మంది పురుష ఓటర్లకు 992 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.ప్రస్తుతం తుది ఓటర్ల జాబితాలో వెయ్యి మంది పురుష ఓటర్లకు 1000.2 మహిళా ఓటర్ల సంఖ్యగా వెల్లడైంది. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 31వ తేదీ వరకు ఓటర్ల నమోదు 8.85లక్షలకు పైగా పెరిగింది. మరోవైపు 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులు 4,40,371 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. వీరిలో 1,89,519 మంది పురుష ఓటర్లు ఉండగా, 2,50,840 మంది మహిళలున్నారు. 12 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 5,06,921 మంది ఉండగా వారిలో 2,90,090 మంది పురుషులు, 2,16,815 మంది మహిళలు, 16 మంది ట్రాన్స్ జెండర్లుగా నమోదయ్యారు.
4 లక్షల మంది ఓటర్లలో యువతులు ఉన్నారు
ఎన్ఆర్ఐలు 2,944 మంది కాగా వారిలో 2,380 మంది పురుషులు, 563 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు. 18- 19 ఏళ్ల వయస్సు కలిగిన ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 9,99,667 మంది ఉండగా, వీరిలో యువకులు 5,70,274 మంది ఉన్నారు. యువతులు 4,29,273 మంది ఉండటం కొసమెరుపు. 120 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఇక రాజధాని హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 45, 37, 256 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా 2,26,574 మంది ఓటర్లు ఉండటం గమనార్హం.
హైదరాబాద్ ఫస్ట్, ములుగు లాస్ట్