LOADING...
తానా సభల్లో చొక్కాలు పట్టుకొని తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు.. కారణం ఇదేనా!
తానా సభలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

తానా సభల్లో చొక్కాలు పట్టుకొని తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు.. కారణం ఇదేనా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 09, 2023
07:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడి గుద్దులతో దాడి చేసుకున్నాడు. ఫిలడెల్ఫియా‌లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూలై 7, 8, 9 తేదీల్లో జరిగిన ఈ సభలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, ఎమ్మెల్యే బాలకృష్ణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలువురు ప్రముఖులు హజరయ్యారు. ఈ సభలో తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు రెండుగా చీలిపోయి చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

Details

జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించలేదని గొడవ? 

కొందరు ఈ సభలో జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావనకు తీసుకురావడంతో ఇది నచ్చని కొందరు టీడీపీ మద్దతుదారులు గొడవకు దిగారని ప్రచారం సాగుతోంది. టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ గొడవ జరగ్గా.. ఆయన పలువురిని విడదీసే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. దీనిపై సోషల్ మీడియాపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. తెలుగు జాతిని కీర్తిని చాటేలా జరిగే ఇలాంటి సభలో కోట్లాట జరగడంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తానా సభలో తెలుగు తమ్ముళ్ల రచ్చ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ