ఏపీ శ్రీకాకుళం కుర్రాడే నీట్ చక్రవర్తి.. దేశంలోనే ప్రథమ ర్యాంక్
ఈ వార్తాకథనం ఏంటి
నీట్ అండర్ గ్రాడ్యూయేట్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.ఈ మేరకు తమిళ విద్యార్థి ప్రభంజన్‌తో కలిసి తొలి ర్యాంకును పంచుకోవడం గమనార్హం.
మంగళవారం రాత్రి నీట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో మే 7న జాతీయ స్థాయిలో 499 నగరాల్లో 4,097 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా 20,38,596 మంది ఎగ్జామ్ రాశారు.
మొత్తంగా పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 11,45,976 మంది అర్హత సాధించారు.
ఇక తెలంగాణ నుంచి దాదాపు 72,842 మంది పరీక్ష రాయగా 42,654 మంది అర్హత సాధించారు. మరోవైపు ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగా, 42,836 మంది అర్హత పొందారు.
DETAILS
జాతీయ స్థాయి నీట్ పరీక్ష ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజాలు :
మహిళల కేటగిరీలో కణి యశశ్రీ 6వ ర్యాంకు (జాతీయ ర్యాంకు 40),
కల్వకుంట్ల ప్రణతిరెడ్డి 9 (జాతీయ ర్యాంకు 45),
జాగృతి బోడెద్దుల 10 (జాతీయ ర్యాంకు 49),
గంధమనేని గిరివర్షిత 11 (జాతీయ ర్యాంకు 51),
లక్ష్మీరష్మిత గండికోట 12 (జాతీయ ర్యాంకు 52),
గిలడ ప్రాచి 17 ర్యాంకు (జాతీయ ర్యాంకు 65)వ సాధించారు.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తొలి ర్యాంకు వై.లక్ష్మీప్రవర్ధనరెడ్డి (జాతీయ ర్యాంకు 25)
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5వ ర్యాంకు తెల్లావరుణ్‌రెడ్డి (జాతీయ ర్యాంకు 105)
ఎస్సీ విభాగంలో 2వ ర్యాంకు యశశ్రీ (జాతీయ ర్యాంకు 40)
ఎస్సీ విభాగంలో 7వ ర్యాంకు కొల్లాబత్తుల ప్రీతం సిద్ధార్థ (జాతీయ ర్యాంకు 299)
DETAILS
టాప్-50 ర్యాంకుల్లో నిలిచిన తెలుగు కుసుమాలు జాబితా ఇదే
ఎస్టీ విభాగంలో మొదటి ర్యాంకు ఎం.జ్యోతిలాల్ చవాన్ (జాతీయ ర్యాంకు 119)
ఎస్టీ విభాగంలో 3వ ర్యాంకు లావుడ్య మధు బాలాజీ (జాతీయ ర్యాంకు 445)
టాప్-50 ర్యాంకుల్లో నిలిచిన తెలుగు కుసుమాలు
1. వరుణ్ చక్రవర్తి - ఫస్ట్ ర్యాంకు ( ఆంధ్రప్రదేశ్)
2. కాంచాని గేయంత్ రఘురాంరెడ్డి - 15వ ర్యాంకు ( తెలంగాణ)
3. యల్లంపల్లి లక్ష్మీ ప్రవర్ధన్‌రెడ్డి - 25వ ర్యాంకు (ఆంధ్రప్రదేశ్)
4. వంగీపురం హర్షిల్‌సాయి ర్యాంకు - 38వ ర్యాంకు ( ఆంధ్రప్రదేశ్),
5. కణి యశశ్రీ - 40వ ర్యాంకు (ఆంధ్రప్రదేశ్),
6. కల్వకుంట్ల ప్రణతిరెడ్డి - 45వ ర్యాంకు (ఆంధ్రప్రదేశ్)
7. జాగృతి బోడెద్దుల - 49వ ర్యాంకు (తెలంగాణ) జాబితాలో ఉన్నారు.