తదుపరి వార్తా కథనం
AP News: ఏపీలో ఫిబ్రవరి నెలలోనే మండుతున్న ఎండలు.. 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు.. ఇబ్బందిపడుతున్న ప్రజలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 06, 2025
04:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి,దీంతో ప్రజలు చాలా ఇబ్బందులుపడుతున్నారు .
గురువారం రోజున కర్నూలు జిల్లా సి.బెలగళ్,సత్యసాయి జిల్లా కొత్త చెరువు,నంద్యాల,కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్,ప్రకాశం జిల్లా కనిగిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
ప్రొద్దుటూరు,అనకాపల్లి,తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, కోనసీమ జిల్లా కపిలేశ్వరంలో 35.8 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో 35.7, ఏలూరు, కాకినాడలో 35.6, విజయనగరంలో 35.5, మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 35.7, బాపట్ల, తణుకులో 35.5, శ్రీకాకుళం జిల్లా పొందూరులో 35.4, తిరుపతి జిల్లా రేణిగుంటలో 35.53, పల్నాడు జిల్లా మాచర్లలో 35.4, చిత్తూరు జిల్లా నగరిలో 35.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.