LOADING...
AP Metro Rail Projects: ఏపీలో మరో కీలక ముందడుగు.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు రేపే టెండర్లు
ఏపీలో మరో కీలక ముందడుగు.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు రేపే టెండర్లు

AP Metro Rail Projects: ఏపీలో మరో కీలక ముందడుగు.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు రేపే టెండర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కీలక ముందడుగు పడింది. విశాఖపట్టణం,విజయవాడ మెట్రో రైలు నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ఈ శుక్రవారం ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ప్రారంభ దశలో మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 40శాతం వరకు పనిచేసే భాగానికే టెండర్లు పిలవనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.21,616 కోట్ల మేరకు వ్యయం అంచనా.

వివరాలు 

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహ భాగస్వామ్యంలో 50:50 నిష్పత్తి మెట్రో ప్రాజెక్టు

ఇందులో విశాఖ మెట్రో రైలు నిర్మాణానికి రూ.11,498 కోట్లు ఖర్చవుతుందని,విజయవాడ మెట్రో ప్రాజెక్ట్‌కు రూ.10,118 కోట్ల వ్యయం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మెట్రో ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహ భాగస్వామ్యంలో 50:50 నిష్పత్తిలో చేపట్టనున్నారు. విశాఖపట్నం మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా వీఎంఆర్డీఏ (VMRDA) ద్వారా రూ.4,101 కోట్లు కేటాయించనుంది. ఇదే విధంగా విజయవాడ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఆర్డీఏ (CRDA) ద్వారా రూ.3,497 కోట్లు మంజూరు చేయనున్నారు.