Page Loader
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వద్ద ఉద్రికత్త.. నీటి హక్కులపై ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య గొడవ
నాగార్జున సాగర్ వద్ద ఉద్రికత్త.. నీటి హక్కులపై ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య గొడవ

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వద్ద ఉద్రికత్త.. నీటి హక్కులపై ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య గొడవ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగార్జునసాగర్ వద్ద ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య మరోసారి వివాదం తలెత్తింది. కుడి కాల్వ వద్ద నీటి రీడింగ్ నమోదు చేయడానికి వచ్చిన తెలంగాణ అధికారులను, ఏపీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై కేఆర్‌ఎంబీ యాజమాన్యానికి తెలంగాణ అధికారులు సమాచారం అందించారు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కోసం సాగర్‌ ఎస్‌ఈ కృష్ణమోహన్‌ అధికారులతో చర్చించారు. అనంతరం వారందరికీ సర్దిచెప్పారు.