
Thopudurthi Prakash Reddy: జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి పోలీసులు గురువారం ఆయనపై కేసు నమోదు చేశారు.
ఇటీవల పాపిరెడ్డిపల్లె వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అక్కడి వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కొంతమంది కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు.
దాంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసుల్లో ఓ కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదుతోనే తోపుదుర్తిపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.
Details
తోపులాటకు కారణంగా తోపుదుర్తి
హెలిప్యాడ్ వద్ద భద్రతకు సంబంధించి పోలీసులు కొన్ని సూచనలు చేసినప్పటికీ, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి వాటిని పాటించలేదని కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
జగన్ హెలికాప్టర్ దిగే ముందు నుంచే కార్యకర్తలు నియంత్రణ తప్పి ముందుకు దూసుకొచ్చారని ఆరోపించారు.
ఇంకా హెలిప్యాడ్ వద్ద రాళ్లదాడి, తోపులాటలకు తోపుదుర్తి రెచ్చగొట్టినట్లు పోలీసులు చేసిన విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటన జగన్ భద్రతపై అనుమానాలు సృష్టించడమే లక్ష్యంగా జరిగిందన్న అభిప్రాయం ఏర్పడింది. తగిన ఆధారాల నేపథ్యంలో పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.