Page Loader
Tenth Results- Telangana- Andhra Pradesh: రేపు ఏపీ టెన్త్ రిజల్ట్స్...మరో పది రోజుల్లో తెలంగాణ ఫలితాలు విడుదల

Tenth Results- Telangana- Andhra Pradesh: రేపు ఏపీ టెన్త్ రిజల్ట్స్...మరో పది రోజుల్లో తెలంగాణ ఫలితాలు విడుదల

వ్రాసిన వారు Stalin
Apr 21, 2024
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ (Telangana) పదో తరగతి పబ్లిక్ పరీక్ష (Public Exams) ఫలితాలు (Results) మరో పదిరోజుల్లో వెలువడునున్నాయి. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో పరీక్షా ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 20 తో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ముగిసింది. ఫలితాలను డికోడ్ చేయడానికి మరో వారం రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పదిరోజుల్లో ఈ ప్రక్రియ అంత పూర్తి చేసి ఏప్రిల్ 30 ఫలితాలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Tenth Exam Results

ఎన్నికల కోడ్​ అమలులో ఉండటంతో...

ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఐ5,08, 385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 2,57, 952 మంది బాలురు కాగా, 2,50,433 మంది బాలురు ఉన్నారు. ఏప్రిల్ 3 వ తేదీనుంచే జవాబు పత్రాల మూల్యాంకన మొదలైంది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో స్పాట్ వాల్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఏప్రిల్ 22 న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. విజయవాడలో ఏప్రిల్ 22 న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేస్తారు.