Threat Call: మోదీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు.. ముంబయి పోలీసులకు బెదిరింపు కాల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో, ఆయన ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్రదాడి ముప్పు ఉందన్న సమాచారంతో తీవ్ర కలకలం రేగింది.
మోదీ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరగవచ్చని సమాచారం అందిందని ముంబయి పోలీసులు వెల్లడించారు.
వివరాలు
ఉగ్ర బెదిరింపు కాల్
ఫిబ్రవరి 11న ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
మోదీ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో, ఆయన ప్రయాణిస్తున్న విమానంపై ఉగ్రదాడి జరగొచ్చని అనామక వ్యక్తి హెచ్చరించాడు.
ఈ సమాచారం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పోలీసులు తక్షణమే ఇతర భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. కాల్ చేసిన వ్యక్తి ఎవరు అనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో తాజా పరిణామాలు
పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి, ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, అతని మానసిక పరిస్థితి సరిగాలేదని అనుమానిస్తున్నారు.
అయితే, ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
వివరాలు
మోదీ విదేశీ పర్యటన
ప్రధాని మోదీ సోమవారం నాడు నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్‌లో ఉన్నారు, అక్కడ కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సులో పాల్గొన్నారు.
పారిస్ పర్యటన ముగిసిన తర్వాత, నేడు అమెరికా ప్రయాణమవుతున్నారు.
అక్కడ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు.