Page Loader
త్వరలోనే టెస్లా యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తాం: మస్క్ 
త్వరలోనే టెస్లా యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తాం: మస్క్

త్వరలోనే టెస్లా యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తాం: మస్క్ 

వ్రాసిన వారు Stalin
Jun 21, 2023
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. తొలిరోజు ప్రధాని మోదీ టెస్లా సీఈవో, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ను కలిశారు. మోదీతో సమావేశం అనంతరం మస్క్ విలేకరులతో మాట్లాడారు. తాను మోదీ అభిమానిని అని చెప్పారు. మోదీతో ఇది అద్భుతమైన సమావేశమని, ఆయనంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. మోదీ కొన్ని సంవత్సరాల క్రితం తమ టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారని, కొంతకాలంగా ఒకరికొకరం తెలుసునని చెప్పారు. ప్రపంచంలోని ఏ పెద్ద దేశానికీ లేనంత భవిష్యత్ భారత్‌కు ఉందని తాను భావిస్తున్నట్లు మస్క్ చెప్పారు. 2015లో కాలిఫోర్నియాలోని టెస్లా మోటార్స్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ సందర్శించారు. ఆ సందర్భంలో మస్క్‌ను ప్రధాని కలిశారు.

మోదీ

ఈ ఏడాది చివరి నాటికి ఇండియాలో ఫ్యాక్టరీని స్థలాన్నిఖరారు చేస్తాం: మస్క్

టెస్లా యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తారా? అని విలేకరులు అడిగినప్పుడు, వీలైనంత తర్వగ భారత్‌కు వెళ్లేందుకు చూస్తామని మస్క్ చెప్పారు. ప్రధానమంత్రి మోదీ భారతదేశం గురించి చాలా ఆలోచిస్తారని, ఆ దేశంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి ఇండియాలో ఫ్యాక్టరీని స్థాపించడానికి స్థలాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని మస్క్ తెలిపారు. మస్క్‌తో తన భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మస్క్‌ను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇద్దరం అనేక విషయాలపై చర్చించుకున్నట్లు మోదీ పేర్కొన్నారు. మోదీ ట్వీట్‌పై మస్క్ కూడా స్పందించారు. మోదీని మళ్లీ కలుసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మస్క్‌తో భేటీపై ప్రధాని మోదీ చేసిన ట్వీట్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీతో భేటీ అనంతరం మాట్లాడుతున్నమస్క్