TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. గణేశ్ నిమజ్జనానికి 600 బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులు అందించనున్నట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఒక్కో డిపో నుంచి 15 నుంచి 30 బస్సుల వరకు పంపిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ సర్వీసులను వినియోగించి ఆయన సూచించారు.
మెట్రో సమయాల్లో మార్పులు
హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 17న అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అన్ని స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి, 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే (MTS) గణేశ్ నిమజ్జనాల సందర్భంగా అదనపు ట్రిప్పులను నడపనున్నట్లు ప్రకటించింది.