Page Loader
AP EAMCET 2023: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చూసుకోండి 
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చూసుకోండి

AP EAMCET 2023: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చూసుకోండి 

వ్రాసిన వారు Stalin
Jun 14, 2023
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ఎంసెట్-2023 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ అనంతపురం (జేఎన్‍టీయూఏ) విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్‌ cets.apsche.ap.gov.in లో చూసుకోవచ్చు. మే 15నుంచి 19వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్‌సీహెచ్ఈ) తరపున ఏపీ ఎంసెట్‌ను జేఎన్‍టీయూఏ నిర్వహించింది. ఎంసెట్‌ పరీక్షకు 3.38 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2.38 లక్షల మంది అభ్యర్థులు ఇంజనీరింగ్ కోసం నమోదు చేసుకోగా, మిగిలిన 1.05 లక్షల మంది అగ్రికల్చర్ కోసం నమోదు చేసుకున్నారు.

ఎంసెట్

డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలను ఇలా చూసుకోండి

1: cets.apsche.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. 2: హోమ్‌పేజీలో AP EAMCET ఫలితాల కోసం అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. 3: తర్వాత కొత్త వెబ్‌పేజీ తెరుచుకుంటుంది. మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి. సమర్పించుపై క్లిక్ చేయండి. 4: మీ ఎంసెట్ ఫలితాలు స్క్రీన్‌పై కనపడుతుయి. 5: అనంతరం స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోండి.