
AP Annual Budget: 3.22 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ ఆమోదం.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి పూర్తిస్థాయి బడ్జెట్. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు కేటాయించారు. మొత్తం రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.40,635 కోట్లుగా అంచనా వేశారు. అలాగే, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా నిర్ధారించారు.
వివరాలు
బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు