'Dhar Gang': దక్షిణాదిని గడగడలాడించిన 'ధార్ గ్యాంగ్' అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన 'ధార్ గ్యాంగ్'ను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
18 రోజుల క్రితం అనంతపురం శ్రీనగర్ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించి, నిందితులను పట్టుకున్నారు.
ఈ దొంగతనానికి ధార్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు గుర్తించిన అనంతరం, జిల్లా ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో జల్లెడపట్టి, ఆధునిక టెక్నాలజీ సహాయంతో పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో గ్యాంగ్ లీడర్ నారూ పచావార్ కూడా ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి రూ. 90 లక్షల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలతో పాటు రూ. 19.35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Details
పదుల సంఖ్యలో కేసులు
ఈ గ్యాంగ్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
దక్షిణ భారతదేశంలోనే ఈ ముఠాపై 32కి పైగా కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు.
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని, పగలు రెక్కీ చేసి రాత్రి చోరీలకు పాల్పడే ఈ ముఠా, అనుమానం రాకుండా బైక్‌లపై సంచరిస్తుందని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.