Page Loader
BJP: ఇవాళ సాయంత్రానికి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తోలి జాబితా 
BJP: ఇవాళ సాయంత్రానికి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తోలి జాబితా

BJP: ఇవాళ సాయంత్రానికి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తోలి జాబితా 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2024
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలు లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లేదా ఎన్డీఏలో బీజేపీ కొత్త మిత్రపక్షాలను కూడా ప్రకటించవచ్చని వారు చెప్పారు. 100 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలోనే ప్రధాని నరేంద్రమోడీతో పాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలుపుతున్నాయి.

Details 

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందే బీజేపీ అభ్యర్థుల ప్రకటన 

ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ సభ్యులు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం రాత్రి సమావేశమైంది. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందే లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని అధికార పార్టీ చూస్తోంది. ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గుజరాత్‌కు చెందిన భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్‌కు చెందిన మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన విష్ణు దేవ్ సాయి, ఉత్తరాఖండ్‌కు చెందిన పుష్కర్ సింగ్ ధామి, గోవాకు చెందిన ప్రమోద్ సావంత్ వంటి వివిధ రాష్ట్రాల నేతలు హాజరయ్యారు.