
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు.. కారణమిదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. సనాతన ధర్మంపై రాజకీయ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
మధురైకు చెందిన న్యాయవాది వంజినాథన్ ఫిర్యాదు మేరకు పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేశారు.
సనాతన ధర్మం ప్రమాదకరమని, దీన్ని నిర్మూలించాలని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో కీలక వ్యాఖ్యలను చేసిన విషయం తెలిసిందే.
ఇక తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
సనాతన ధర్మాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని, దాన్ని తుడిచిపెట్టాలని ప్రయత్నించే వారే చెరిపిపోతారంటూ పవన్ మాట్లాడారు. దీంతో ఉదయనిధిపై పరోక్షంగా విమర్శలు చేశారని ఆయనపై మధురైలో కేసు పెట్టారు.
Details
డీఎంకే సోషల్ మీడియా వింగ్ లో పవన్ కళ్యాణ్‌పై ట్రోల్స్
ఈ వివాదం నేపథ్యంలో డీఎంకే సోషల్ మీడియా వింగ్ పవన్ కళ్యాణ్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి.
ఈ వివాదానికి సంబంధించి డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ, తమ పార్టీ ఎప్పుడూ హిందూ మతంపై విమర్శలు చేయదని, కేవలం కుల వ్యతిరేకతపై మాత్రమే మాట్లాడుతుందని తెలిపారు.
ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ పార్టీలు మాత్రమే హిందూ మతానికి నిజమైన శత్రువులని ఆయన వ్యాఖ్యనించారు.
తాజాగా తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలు, హిందుత్వంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కి ఉన్న ఫాలోయింగ్ తమిళనాడులో కూడా విస్తరిస్తోందని, భవిష్యత్తులో కర్ణాటక, కేరళల్లోనూ ఆయన పర్యటనలు జరపవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.