Rythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రైతుబంధు పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 'రైతుబంధు' పంపిణీకి ఇటీవల అనుమతి ఇచ్చిన ఈసీ .. తాజాగా ఆ అనుమతిని ఉపసంహరించకుంది. రైతుబంధు అనేది కొత్తది కాదని, కొనసాగుతున్న పథకమని, పంపిణీకి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. దీంతో యాసంగి పంట కోసం ఈనెల 28వ తేదీ వరకు రైతుబంధు పంపిణీకి ఈసీ శుక్రవారం అనుమతినిచ్చింది. ఎన్నికల వేళ.. రైతుబంధు పంపిణీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని ఫిర్యాదులు అందడంతో ముందుగా ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసుకుంది. ఈసీ తాజా నిర్ణయం బీఆర్ఎస్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. దీంతో 70 లక్షల మంది రైతులకు 'రైతుబంధు' నిలిచిపోయింది.