LOADING...
Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని ఆస్పత్రికి దానం చేసిన కుటుంబ సభ్యులు
ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని ఆస్పత్రికి దానం చేసిన కుటుంబం

Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని ఆస్పత్రికి దానం చేసిన కుటుంబ సభ్యులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2024
05:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

పౌర హక్కుల ఉద్యమకారుడు, మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (54) శనివారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని ఆస్పత్రికి దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. సాయిబాబా నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేసినట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. సాయిబాబా భౌతికకాయాన్ని జవహర్‌నగర్‌లోని నివాసానికి తరలించగా, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించారు. అనంతరం ఆయన కోరిక మేరకు భౌతికకాయాన్ని ఆస్పత్రికి అప్పగించనున్నారు.

Details

పదేళ్లు జైలు జీవితం గడిపిన సాయిబాబా

2014లో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో సాయిబాబాను అరెస్టు చేశారు. 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనకు జీవితఖైదు విధించింది. దాదాపు పదేళ్లు జైల్లో గడిపిన సాయిబాబా, ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. మానవహక్కుల ఉద్యమకారుడిగా, రచయితగా, విద్యావేత్తగా సాయిబాబా విశేషమైన గుర్తింపు పొందారు.