
Apache Helicopters: అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న అపాచీ ఏహెచ్-64ఈ అటాక్ హెలికాప్టర్లు
ఈ వార్తాకథనం ఏంటి
అత్యాధునిక అపాచీ ఏహెచ్-64ఈ దాడి హెలికాప్టర్లు (Apache AH-64E Attack Helicopters) తాజాగా అమెరికా నుంచి భారత్‌కు వచ్చాయి. భారత వాయుసేన (Indian Air Force) ఆధీనంలో ఉన్న హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఇవాళ ఇవి ల్యాండ్ అయ్యాయి. ఈ హెలికాప్టర్లను పొందేందుకు భారత్ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీటి డెలివరీ ఆలస్యం అయింది. ఈ హెలికాప్టర్లు శత్రు దేశాలపై దాడులకు, గూఢచర్యానికి రెండింటికీ ఉపయోగపడతాయి. ప్రత్యేకించి పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో వీటిని మోహరించనున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఇండియన్ ఆర్మీ స్థాపించిన తొలి అపాచీ స్క్వాడ్రన్‌కు 15 నెలల తర్వాత తాజాగా ఇవి భారత్‌కి వచ్చాయి.
వివరాలు
అమెరికా నుంచి 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసిన భారత వాయుసేన
ఇకపోతే, 2015లో అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం భారత వాయుసేన 22 అపాచీ హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. 2020 జూలైలో ఆ 22 హెలికాప్టర్లను అమెరికా భారత్‌కు డెలివరీ చేసింది. అదే ఏడాది చివరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా మరో 6 అపాచీ హెలికాప్టర్లు కొనుగోలు చేయాలనే కొత్త ఒప్పందాన్ని భారత్ చేసుకుంది. ఆ 6 హెలికాప్టర్లలో మొదటి విడతలో 3 అపాచీ హెలికాప్టర్లు 2024 మే,జూన్ నెలల్లో భారత్‌కు రానున్నాయని ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే, సప్లై చైన్‌లో ఏర్పడిన అంతరాయాలు, అంతర్జాతీయంగా మారుతున్న జియోపాలిటికల్ పరిస్థితుల కారణంగా ఈ హెలికాప్టర్ల డెలివరీ ఆలస్యమైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న అపాచీ ఏహెచ్-64ఈ అటాక్ హెలికాప్టర్లు
The first batch of Apache attack Helicopters for the Indian Army has reached India. The choppers will be deployed in Jodhpur by the Indian Army: Indian Army officials
— ANI (@ANI) July 22, 2025
(Pics source: Indian Army) pic.twitter.com/u1u1Qwi56m