Page Loader
Chandrababu: తిరుపతిలో బాలికపై హత్యాచార ఘటన.. స్పందించిన సీఎం చంద్రబాబు
తిరుపతిలో బాలికపై హత్యాచార ఘటన.. స్పందించిన సీఎం చంద్రబాబు

Chandrababu: తిరుపతిలో బాలికపై హత్యాచార ఘటన.. స్పందించిన సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2024
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతి జిల్లా వడమాలపేటలో జరిగిన మూడేళ్ల బాలికపై హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. దీనికి సంబంధించి, చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందజేయాలని కలెక్టర్‌కు ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం హోంమంత్రి అనిత బాధిత కుటుంబానికి ఈ చెక్కును అందించనున్నారు.

Details

నిందితులకు శిక్ష పడేలా చేస్తాం : హోంమంత్రి

హోంమంత్రి అనిత ఈ దారుణ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, చాక్లెట్లు ఆశ చూపించి అమాయక బాలికపై దాడి చేయడం చాలా హేయమని అన్నారు. నిందితుడు వెంటనే అరెస్టు చేయాలని ఆమె పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ ఘటనపై తక్షణ విచారణ చేపట్టి, నిందితుడు కఠిన శిక్షకు గురి కావాలని అనిత స్పష్టం చేశారు.