Page Loader
'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీని దోషిగా తేల్చిడంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీ అరెస్ట్ వారెంట్‌పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీని దోషిగా తేల్చిడంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Stalin
Apr 08, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

'మోదీ ఇంటిపేరు' వివాదంలో రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిపై తమిళనాడులోని దిండిగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శనివారం అనుచితన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తమ నేత రాహుల్‌ గాంధీని జైలుకు పంపేలా తీర్పు వెలువరించిన న్యాయమూర్తి నాలుక నరికివేస్తామని కాంగ్రెస్‌ డిండిగల్‌ జిల్లా అధ్యక్షుడు మణికందన్‌ హెచ్చరించారు. ప్రధాని తమిళనాడు పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. ఆందోళనలో భాగంగా మణికందన్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో రాహుల్ గాంధీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో న్యాయమూర్తిని హెచ్చరించిన మణికందన్