Eknath Shinde: ప్రజలు ఇచ్చిన మెజారిటీని ప్రతిపక్షాలు అంగీకరించాలి.. ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి విజయం సాధించిన సందర్భంగా ప్రతిపక్షాలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఓడినప్పుడు ఈవీఎంలను తప్పుపట్టడం ప్రతిపక్షాల అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన స్పష్టమైన మెజారిటీని ప్రతిపక్షాలు స్వీకరించాలని ఆయన సూచించారు. గత రెండు సంవత్సరాల కాలంలో మహాయుతి కూటమి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విజయం వాటి ఫలితమే అని చెప్పారు.
ప్రతిపక్షాలపై మండిపడ్డ షిండే
ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ, వాయనాడ్ లోక్‌సభ ఎన్నికలలో కూడా ప్రతిపక్షాలు గెలిచినప్పటికీ, అప్పుడప్పుడు ఈవీఎంలపై ప్రతిపక్షాలు ఎటువంటి విమర్శలు చేయలేదని షిండే గుర్తు చేశారు. షిండే 2024 లోక్‌సభ ఎన్నికలలో తన కూటమికి 43.55 శాతం ఓట్లు వచ్చినా, మహా వికాస్ అఘాడీ కూటమికి 43.71 శాతం ఓట్లు వచ్చినప్పుడు, 0.16 శాతం ఓట్ల తేడాతో తమ కూటమి 17 స్థానాల్లో మాత్రమే గెలిచిందని తెలిపారు. అప్పుడు ఈవీఎంలపై ఎందుకు విమర్శలు చేయలేదు?" అని ఆయన ప్రశ్నించారు.