Page Loader
Bandi Sanjay: 'కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామానే'.. బండి సంజయ్ ఫైర్
'కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామానే'.. బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: 'కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామానే'.. బండి సంజయ్ ఫైర్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం అంతా ఒక ఫ్యామిలీ డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం 'కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్' పేరుతో సినిమా నడుస్తోందంటూ ఎద్దేవా చేశారు. భారాసలో చార్‌పత్తా ఆట సాగుతోందని, ఈ రాజకీయ డ్రామాకు కాంగ్రెస్ పార్టీ నిర్మాతగా మారిందన్నారు. బీజేపీ ఎప్పుడూ అవినీతి పాలిత బీఆర్ఎస్‌తో కలవదని స్పష్టం చేశారు. కవిత అరెస్ట్‌ తప్పించుకోవడానికి తమ పార్టీతో కలవాలనే ప్రయత్నాలు చేసినట్టు ఆరోపించారు. అయితే బీజేపీ-బీఆర్ఎ‌స్ ల మధ్య ఎలాంటి పొత్తులు లేవని, నిజమైన పొత్తు కాంగ్రెస్-బీఆర్ఎస్‌ల మధ్యే జరిగిందన్నారు.

Details

ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకూ యుద్ధం ఆగదు

వేములవాడలోని రాజన్న గోశాలలో కోడెలు చనిపోవడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఈవోతో మాట్లాడతానని తెలిపారు. కోడెల సంఖ్య ఆధారంగా గోశాల విస్తరణ జరగాలని సూచించారు. అలాగే రాజన్న ఆలయ నిధులు మాజీ సీఎం వేరే ప్రాంతానికి మళ్లించారని విమర్శించారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మన సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. పాకిస్తాన్‌పై యుద్ధం ఇంకా కొనసాగుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించే వరకు యుద్ధం కొనసాగుతుందన్నారు.