తదుపరి వార్తా కథనం

PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 11, 2025
04:58 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అంతర్జాతీయ సమాజం ఆందోళన మేరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఆయన మాట్లాడుతూ, రెండు దేశాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు తెలిపారు. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
కాల్పుల విరమణ గురించి చర్చల సందర్భంగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై చేసిన వ్యాఖ్యలు గమనార్హం.
ఆయన, జేడీ వాన్స్‌తో మాట్లాడుతూ, పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేస్తే, భారత్ తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటుందని స్పష్టం చేసినట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.