PM Modi: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో పవిత్ర రంజాన్ మాసం అధికారికంగా ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం ఉపవాసాలు (రోజాలు) ప్రారంభించింది.
శనివారం సాయంత్రం నెలవంక కనిపించిన అనంతరం ప్రజలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
మన సమాజంలో శాంతి, సౌహార్దం వెల్లివిరియాలి. ఈ మాసం ఆత్మపరిశీలన, కృతజ్ఞత, భక్తి లక్షణాలను ప్రతిబింబిస్తూ, దయ, సహానుభూతి, సేవ వంటి విలువలను గుర్తు చేస్తుంది.
రంజాన్ ముబారక్! అంటూ తన ఎక్స్ ఖాతాలో మోదీ పోస్టు చేశారు. అని పేర్కొన్నారు.
Details
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన యోగి ఆదిత్యనాథ్
గత శుక్రవారం జహాన్-ఏ-ఖుస్రో 25వ ఎడిషన్‌లో పాల్గొన్న ప్రధాని, రంజాన్ పండుగకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా భారతదేశపు సూఫీ సంప్రదాయానికి సంబంధించి ఆయన ప్రశంసలు వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, రంజాన్ మాసం ప్రారంభం చందమామ దర్శనంపై ఆధారపడి ఉంటుంది.
ముస్లింలు నెలవంక కనిపించిన రోజు నుంచి రంజాన్ ప్రారంభించి, నెల పొడవునా ఉపవాసం (రోజాలు) పాటిస్తారు.
మొత్తం 29 లేదా 30 రోజులపాటు ఈ పవిత్ర మాసం కొనసాగి, రంజాన్ ముగిసిన అనంతరం 'ఈద్ పండుగ' ఘనంగా నిర్వహిస్తారు.