Telangana : స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ ఇవాళ కూడా కొనసాగుతోంది. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు (యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ - పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ బిల్లు 2024)ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సభ ప్రారంభమైన వెంటనే మంత్రి శ్రీధర్ బాబు ఈ బిల్లును సభ ముందు ప్రవేశపెట్టారు. దీంతో పాటు మరో 19 పద్దతులపై శాసనసభలో చర్చ కూడా సాగుతోంది.
20వేల మంది విద్యార్థులకు శిక్షణ
విద్యార్థులకు సమగ్ర నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలను అందించడంపై దృష్టి సారించాలన్నారు. 20వేల మంది విద్యార్థులకు శిక్షణ, వివిధ ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ బిల్లు ఉద్దేశమన్నారు. విద్య, ఉపాధిని అందించడంలో ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తుందన్నారు. నిన్న ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమై తెల్లవారు జామును 3.15 గంటల వరకూ కొనసాగాయి.