Bihar : పట్టాలు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన రైలు ఇంజిన్.. ప్రమాదం నుంచి బయటపడ్డ రైతులు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో గయా సమీపంలో భారీ రైలు ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పిన ఘటన శుక్రవారం సాయంత్రం గయా-కోడెర్మా రైల్వే సెక్షన్‌లోని కొల్హానా హాల్ట్ వద్ద జరిగింది.
ఇంజన్‌ను లూప్‌లైన్ నుంచి గయా వైపుకు తీసుకెళ్తుండగా, ఇంజన్ ఒక్కసారిగా అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రమాదంలో ఇంజిన్‌కి మాత్రమే నష్టం వాటిల్లింది. ఇంజిన్‌తో పాటు కోచ్‌లు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
Details
క్షేమంగా బయటపడ్డ లోకో పైలట్
ఘటన జరిగినప్పుడు పొలాల్లో పని చేస్తున్న రైతులు భయంతో పరుగులు తీశారు. ఈ సమయంలో లోకో పైలట్ కిందకు దూకినట్లు తెలిసింది.
ఇటీవలి కాలంలో భారతీయ రైల్వేలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటన ట్రాక్ మార్పు కారణంగానే జరిగిందని రైల్వే అధికారులు గుర్తించారు.
సహాయక చర్యలు వెంటనే చేపట్టారు. రైల్వే బృందం గంట వ్యవధిలో మరమ్మతులు పూర్తి చేసి, గూడ్స్ రైలును తిరిగి పట్టాలపై ప్రయాణించేలా చేశారు.